1. రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్లకు రకరకాల ప్లాన్స్ అందిస్తోంది. డేటా తక్కువ వాడేవారికి, ఎక్కువ వాడేవారికి వేర్వేరు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్ యూజర్లలో మొబైల్ డేటా తక్కువ వాడేవారు ఉంటారు. వారికి రోజూ 1జీబీ లేదా 1.5జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ సరిపోతాయి. రోజూ 1జీబీ, 1.5జీబీ డేటా ఇస్తున్న ప్లాన్స్ ఏవీ? ఇతర బెనిఫిట్స్ ఏం ఉన్నాయి? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. Jio 2545 Plan: జియో రూ.2,545 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 504జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio 783 Plan: జియో రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితం. రూ.149 విలువైన డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)