ఇది వోక్స్వ్యాగన్ ID. 2 ఆల్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు. దీని ధర 25,000 యూరోల (రూ.22,19,778)కంటే తక్కువే అని కంపెనీ తెలిపింది. (Photo: Volkswagen) ఈ కారును ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే.. 450 కిలోమీటర్లు వెళ్లగలదని కంపెనీ చెప్పింది. (Photo: Volkswagen) ఈ కారును 2025లో ఉత్పత్తి చేస్తామని కంపెనీ ప్రకటించింది. (Photo: Volkswagen) ఈ కారులో ట్రావెల్ అసిస్టెంట్, ఐక్యూ లైట్ లేదా ఎలక్ట్రిక్ వెహికిల్ రూట్ ప్లానర్ వంటి ప్రీమియం ఇన్నోవేషన్స్ ఉంటాయని తెలిపింది. (Photo: Volkswagen) న్యూ MEB ఎంట్రీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఈ కారు ఉత్పత్తి ఉంటుందని చెప్పింది. (Photo: Volkswagen) 2026 నుంచి పది రకాల మోడల్స్‌తో ఈ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వివరించింది. (Photo: Volkswagen) ఈ కారు 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. (Photo: Volkswagen) ఈ కారు జీరో నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 7 సెకండ్లలో అందుకుంటుందని వివరించింది. (Photo: Volkswagen) ఈ కారు అత్యధిక వేగం గంటకు 160 కిలోమీటర్లు. (Photo: Volkswagen) ఈ కారు పొడవు 4,050 mm కాగా.. వెడల్పు 1,812 mm.. ఎత్తు 1,530 mm. (Photo: Volkswagen) ఈ కారు కావాలనుకునేవారు 2026లో దీన్ని పొందగలరు. అద్భుతమైన డిజైన్‌తో ఇది వస్తుందని కంపెనీ తెలిపింది. (Photo: Volkswagen) ఈ కారు యూరోపియన్ మార్కెట్లో ముందుగా వస్తుంది. తర్వాత ప్రపంచ మార్కెట్లకు రానుంది. (Photo: Volkswagen)