1. వివో ఇండియా ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. లేటెస్ట్గా వివో వై35 (Vivo Y35) రిలీజ్ చేసింది. ఇందులో 8GB ర్యామ్ + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్‌తో మొత్తం కలిపి 16GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 20,000) రిలీజైంది. (image: Vivo India)
2. వివో వై35 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. వివో వై35 కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.18,499. వివో ఇండియా ఇ-స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకే. (image: Vivo India)
3. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.16,600 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.17,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మిగతా మొత్తం చెల్లించి వివో వై35 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. (image: Vivo India)
4. వివో వై35 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల పుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ మోటో జీ32, మోటో జీ52, రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Vivo India)
5. వివో వై35 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్‌తో 8జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. మొత్తం 16జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
6. వివో వై35 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ బొకే కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియర్ కెమెరాలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), స్టెబిలైజేషన్ అల్గారిథమ్స్, సూపర్ నైట్ కెమెరా మోడ్, మల్టీ స్టైల్ పోర్ట్రైట్ మోడ్, రియర్ కెమెరా బోకే ఫ్లేర్ పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
7. వివో వై35 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మల్టీ టర్బో మోడ్, అల్ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)