Xiaomi Mi 10i: ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు ఇష్టపడేవారి కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)