1. వివో ఇండియా కొద్ది రోజుల క్రితం వివో వై21జీ (Vivo Y21G) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ70 గేమింగ్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. రిలీజ్ నాటితో పోలిస్తే ఇప్పుడు ధర కూడా కాస్త తగ్గింది. (image: Vivo India)
2. వివో వై21జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. రిలీజ్ అయినప్పుడు ధర రూ.13,999. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,499 ధరకే లభిస్తోంది. వివో ఇండియా వెబ్సైట్లో కూడా కొనొచ్చు. మిడ్నైట్ బ్లూ, డైమండ్ గ్లో కలర్స్‌లో కొనొచ్చు. రూ.15,000 లోపు బడ్జెట్లో ఉన్న మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. (image: Vivo India)
3. వివో వై21జీ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,750 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ పొందొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.12,750 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత మొబైల్‌కు రూ.12,750 డిస్కౌంట్ లభిస్తే మీరు చెల్లించాల్సింది కేవలం రూ.1249 మాత్రమే. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా నేరుగా కొనేవారికి బ్యాంకు ఆఫర్స్ ఉన్నాయి. (image: Vivo India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.1,500 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ఇక అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్‌లో నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.1,500 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Vivo India)
5. వివో వై21జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ సీ25, ఇన్ఫీనిక్స్ హాట్ 10, రియల్మీ సీ3 స్మార్ట్ఫోన్లలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌తో రిలీజైంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 1జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో స్టోరేజ్ 128జీబీ పెంచుకోవచ్చు. (image: Vivo India)
6. వివో వై21జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో, పనో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్, పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
7. వివో వై21జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ సిమ్ + మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. (image: Vivo India)