2. వివో వీ27 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. మ్యాజిక్ బ్లూ, నోబెల్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది. (image: Vivo India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో వివో వీ27 స్మార్ట్‌ఫోన్ కొనేవారికి పలు ఆఫర్స్ ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొంటే రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ రూ.3,667 నుంచి ప్రారంభం అవుతుంది. పార్ట్నర్ ఆఫర్లో భాగంగా వివో టీడబ్ల్యూఎస్ ఎయిర్‌ను రూ.2,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Vivo India)
4. వివో ఆన్లైన్ స్టోర్‌లో కొనేవారికీ పలు ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.2500 తగ్గింపు లభిస్తుంది. అదనంగా రూ.2500 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. వివో ఆన్లైన్ స్టోర్‌లో కొంటే రూ.599 విలువైన వివో ఇయర్‌ఫోన్స్ ఉచితంగా లభిస్తాయి. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐతో ఈ మొబైల్ కొనొచ్చు. (image: Vivo India)
6. వివో వీ27 మొబైల్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX766V ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రైట్, ఆరా లైట్, పనోరమా, టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: News18)