1. వివో ఇండియా దసరా ఫెస్టివల్ సీజన్ కన్నా ముందు వివో వీ25 సిరీస్‌లో వివో వీ25 5జీ (Vivo V25 5G) మొబైల్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఏకంగా రూ.17,500 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Vivo India)
3. వివో వీ25 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. (image: Vivo India)
4. వివో వీ25 స్మార్ట్‌ఫోన్‌ను ఈఎంఐ ద్వారా కొనొచ్చు. ఈఎంఐ ఆప్షన్ రూ.5,333 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఎక్స్ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.17,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత మొబైల్‌కు రూ.17,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే రూ.10,499 చెల్లిస్తే చాలు. బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.10,000 లోపే కొనొచ్చు. (image: Vivo India)
5. వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. బ్యాక్ ప్యానెల్‌కు కలర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ ఉంది. సూర్యకాంతి లేదా యూవీ కిరణాలు పడ్డప్పుడు బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
6. వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ఐ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. లిక్విడ్ కూల్ సిస్టమ్, గేమ్ బూస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
7. వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ ఫీచర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా 8జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. పనిచేస్తుంది. సర్ఫింగ్ బ్లూ, ఎలిగెంట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)