1. వివో ఇండియా భారతదేశంలో వివో వీ23 5జీ (Vivo V23 5G), వివో వీ23 ప్రో 5జీ (Vivo V23 Pro 5G) మోడల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో వివో వీ23 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,990. (image: Vivo India)
2. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. వివో వీ23 స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కంటే రూ.2,500 తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Vivo India)
3. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్ సీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Vivo India)
4. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, అల్ట్రా వైడ్ నైట్, సూపర్ మ్యాక్రో, బొకే పోర్ట్రైట్, పోర్ట్రైట్ ఫిల్టర్స్, బొకే ఫ్లేర్ పోర్ట్రైట్, హై రెజల్యూషన్, లైవ్ ఫోటో, ఏఆర్ స్టిక్కర్స్, స్లోమో, టైమ్ ల్యాప్స్, డ్యూయెల్ వ్యూ వీడియో, డబుల్ ఎక్స్పోజర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
5. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరాలో ఆటో ఫోకస్, ఏఐ ఎక్స్‌స్ట్రీమ్ నైట్, స్టెడీఫేస్ సెల్ఫీ వీడియో, మల్టీస్టైల్ పోర్ట్రైట్, డబుల్ ఎక్స్పోజర్, వీడియో ఫేస్ బ్యూటీ, డ్యూయెల్ వ్యూ వీడియో, స్లో మో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
6. వివో వీ23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,200ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టార్‌డస్ట్ బ్లాక్, సన్‌షైన్ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. భారతదేశంలో మొదటి కలర్ ఛేంజింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. సన్‌షైన్ గోల్డ్ కలర్లో వచ్చే మోడల్ వెనుక కలర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ఉంటుంది. (image: Vivo India)