1. వివో ఇండియా లేటెస్ట్గా టీ సిరీస్‌లో వివో టీ1 ప్రో 5జీ (Vivo T1 Pro 5G), వివో టీ1 44W (Vivo T1 44W) మోడల్స్‌ని లాంఛ్ చేసింది. వివో టీ1 ప్రో 5జీ మోడల్లో పాపులర్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఉండటం విశేషం. వివో టీ1 ప్రో 5జీ రూ.25,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. మే 5 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్ ప్రారంభం కానుంది. (image: Vivo India)
2. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. టర్బో బ్లాక్, టర్బో సియాన్ కలర్స్‌లో కొనొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Vivo India)
3. మే 31 వరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.832 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Vivo India)
4. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ ఉండటం విశేషం. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. (image: Vivo India)
5. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల రిలీజైన ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ 9 ఎస్ఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం52, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Vivo India)
6. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, పోర్ట్రైట్, ఫోటో, వీడియో, 64MP, పనో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్-లాప్స్, ప్రో, AR స్టిక్కర్స్, డాక్యుమెంట్స్, డ్యూయల్ వ్యూ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)