1. వివో ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి టీ సిరీస్‌లో (Vivo T Series) మొదటి మోడల్‌ను ఇటీవల పరిచయం చేసింది. వివో టీ1 5జీ (Vivo T1 5G) స్మార్ట్‌ఫోన్‌ను గత వారం రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండటం విశేషం. ఇది లేటెస్ట్ 5జీ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో రిలీజైన రెండో స్మార్ట్‌ఫోన్ ఇది. (image: Vivo India)
2. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990. ఇప్పటికే ఈ బడ్జెట్లో రెడ్మీ నోట్ 11టీ, రియల్మీ నార్జో 30 ప్రో, రియల్మీ 8 లాంటి మోడల్స్ ఉన్నాయి. (image: Vivo India)
3. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో ఇ-స్టోర్‌లో కొనొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి రూ.15,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Vivo India)
4. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్ట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్స్‌తో 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో మెమొరీ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. (image: Vivo India)
6. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో పనో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, ఏఆర్ స్టిక్కర్స్, డాక్యుమెంట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Vivo India)
7. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ వేడికాకుండా కంట్రోల్ చేయడానికి 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉండటం విశేషం. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రెయిన్బో ఫ్యాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)