1. వివో ఇండియా ఇటీవల టీ సిరీస్‌లో వివో టీ1 ప్రో 5జీ (Vivo T1 Pro 5G), వివో టీ1 44W (Vivo T1 44W) స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. వీటిలో వివో టీ1 ప్రో 5జీ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. వివో టీ1 44W సేల్ మే 8న జరగనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Vivo India)
2. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో ఇండియా స్టోర్‌లో కొనొచ్చు. (image: Vivo India)
3. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. మే 31 లోగా ఈ స్మార్ట్ఫోన్లు కొనేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. (image: Vivo India)
4. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే ఉండటం విశేషం. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Vivo India)
5. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మోటో జీ52, రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ మొబైల్స్‌లో ఉంది. (image: Vivo India)