1. అమెజాన్‌లో వివో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని స్మార్ట్ఫోన్ల ధరలు కూడా తగ్గాయి. వివో వై53ఎస్ (Vivo Y53s) స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ధర రూ.19,490. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది కంపెనీ. (image: Vivo India)
2. ప్రస్తుతం వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,490 ధరకు కొనొచ్చు. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందన్న వివరాలు లేవు. అయితే ధర తగ్గింపు మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కస్టమర్లు వివో వై53ఎస్ మొబైల్‌ను రూ.18,490 ధరకే కొనొచ్చు. బ్యాంక్ కార్డులతో డిస్కౌంట్ కూడా పొందొచ్చు. డీప్ సీ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్స్‌లో కొనొచ్చు. (image: Amazon India)
3. ఈ సేల్‌లో వివో వీ21 సిరీస్, వివో ఎక్స్60 5జీ, వివో వై72, వివో వై73, వివో వై33ఎస్, వివో వై20టీ, వివో వై21, వివో వై12జీ, వివో వై1ఎస్, వివో వై3ఎస్ స్మార్ట్ఫోన్లపైనా ఆఫర్స్ ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Vivo India)
4. వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ + 128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు. (image: Vivo India)
5. వివో వై53ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సూపర్ నైట్ కెమెరా మోడ్, ఐ ఆటో ఫోకస్, అల్ట్రా స్టేబుల్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)