1. వివో వై72 5జీ (Vivo Y72 5G) స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. గతేడాది జూలైలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.20,990. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. శాశ్వతంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది వివో ఇండియా. (image: Vivo India)
2. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గిన ధరలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అప్డేట్ అయ్యాయి. రీటైల్ స్టోర్లలో కూడా తగ్గింపు ధరలకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. అమెజాన్‌లో రూ.14,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.14,000 ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ లభిస్తే మీరు రూ.6,000 చెల్లిస్తే చాలు. (image: Vivo India)
4. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్‌తో మరో 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా గేమ్ మోడ్, ఇస్పోర్ట్స్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
5. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో పోర్ట్రైట్, నైట్, పనోరమా, లైవ్ ఫోటో, స్లో మో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
6. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సిస్టమ్ ప్రాసెస్ ఆప్టిమైజ్ చేసేందుకు మల్టీ-టర్బో 5.0 ఫీచర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిమ్స్ మ్యాజిక్, స్లేట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)6. వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సిస్టమ్ ప్రాసెస్ ఆప్టిమైజ్ చేసేందుకు మల్టీ-టర్బో 5.0 ఫీచర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిమ్స్ మ్యాజిక్, స్లేట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)
7. నిన్నటి వరకు రూ.20,000 కన్నా ఎక్కువ ధర ఉన్న వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పడు రూ.20,000 లోపు బడ్జెట్లోకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సేల్ ఉన్నప్పుడు ఆఫర్స్‌తో కలిపి ఇంకా ధర తగ్గొచ్చు. ప్రస్తుతం ఈ బడ్జెట్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్మీ నోట్ 11టీ 5జీ, రియల్మీ 8ఎస్, ఐకూ జెడ్3 లాంటి మోడల్స్ ఉన్నాయి. (image: Vivo India)