Vivo Diwali Offer: రూ.101 ఇచ్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనండి... దివాళీ స్పెషల్ ఆఫర్
Vivo Diwali Offer: రూ.101 ఇచ్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనండి... దివాళీ స్పెషల్ ఆఫర్
Vivo Diwali Offer | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి వివో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.101 ఇచ్చి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.
1. వివో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'గ్రేట్ దివాళీ ఆఫర్' ప్రకటించింది వివో. రూ.101 చెల్లించి మీకు నచ్చిన వివో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోండని పిలుపునిస్తోంది. (image: Vivo India)
2/ 6
2. ప్రస్తుతం దీపావళి సీజన్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కూడా ఈ దీపావళి ఆఫర్ ప్రకటించింది. (image: Vivo India)
3/ 6
3. వివో 'గ్రేట్ దివాళీ ఆఫర్'లో భాగంగా కస్టమర్లు రూ.101 చెల్లించి వివో స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్లకు ఈ ఆఫర్ లభిస్తుంది. కస్టమర్లు తమకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసిన తర్వాత రూ.101 చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ఈఎంఐల ద్వారా చెల్లించాలి. (image: Vivo India)
4/ 6
4. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక హోమ్ క్రెడిట్ ద్వారా కొంటే ఎలాంటి డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. (image: Vivo India)
5/ 6
5. వివో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఒకసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉచితంగా లభిస్తుంది. ఐడీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వివో అప్‌గ్రేడ్ ప్లాన్‌లో భాగంగా రూ.1500 అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 80 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. (image: Vivo India)
6/ 6
6. వివో 'గ్రేట్ దివాళీ ఆఫర్'లో వివో వీ20 ఎస్ఈ, వివో వీ20, వివో ఎక్స్50, వివో వై50 స్మార్ట్ఫోన్లను కొనొచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వివో స్టోర్‌లో తెలుసుకోవచ్చు. (image: Vivo India)