Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... లేటెస్ట్ రేట్స్, స్పెసిఫికేషన్స్ ఇవే
Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... లేటెస్ట్ రేట్స్, స్పెసిఫికేషన్స్ ఇవే
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో ఇటీవల రిలీజ్ చేసిన వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. వివో ఎస్1 మూడు వేరియంట్లపై ధర తగ్గించింది వివో. లేటెస్ట్ రేట్స్‌తో పాటు వివో ఎస్1 ప్రత్యేకతలు తెలుసుకోండి.
1. వివో ఆగస్ట్‌లో రిలీజ్ చేసిన వివో ఎస్1 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4జీబీ+128జీబీ, 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ చేసింది వివో. (image: Vivo India)
2/ 11
2. ఈ మూడు వేరియంట్ల ధరల్ని తగ్గించింది. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ పాత ధర రూ.17,990 కాగా రూ.2,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.15,990 మాత్రమే. (image: Vivo India)
3/ 11
3. ఇక వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ పాత ధర రూ.18,990 కాగా రూ.1,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.17,990. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ పాత ధర రూ.19,990 కాగా రూ.2,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.17,990. (image: Vivo India)
4/ 11
4. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లు రూ.17,990 ధరకే లభించడం విశేషం. (image: Vivo India)
5/ 11
5. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో అధికారిక వెబ్సైట్ vivo.com లో కొనొచ్చు. (image: Vivo India)
6/ 11
6. ఇక వివో ఎస్1 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.38 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ఫ్లే ఉండటం విశేషం. (image: Vivo India)
8. వివో ఎస్1 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉండటం మరో విశేషం. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వివో ఎస్1 సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్. (image: Vivo India)
9/ 11
9. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. హెచ్డీఆర్, జియో ట్యాగింగ్, పనోరమా, పోర్ట్రైట్ ఫీచర్లున్నాయి. (image: Vivo India)
10/ 11
10. వివో ఎస్1 మీడియాటెక్ పీ65 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. (image: Vivo India)
11/ 11
11. వివో ఎస్1 ఆండ్రాయిడ్ 9 పై + ఫన్‌టచ్ ఓఎస్ 9 ఇంటర్ఫేస్తో పనిచేస్తుంది. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Vivo India)