అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ రిటైల్ స్టోర్ విజయ్ సేల్స్ బంపరాఫర్లు ప్రకటించింది. ప్రీమియం సెగ్మెట్లో లభించే యాపిల్ ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. అన్ని ఆఫర్లు ఉపయోగించుకుంటే.. ఐఫోన్ 13ను కేవలం రూ. 57,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 మార్కెట్లోకి రూ. 79,900 ధర వద్ద రిలీజైంది. అయితే, డిస్కౌంట్‌పై ప్రస్తుతం ఇది రూ. 71,900 వద్ద అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, విజయ్ సేల్స్ వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, కోటక్, ఎస్బిఐ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే రూ. 6000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీనికి అదనంగా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా విజయ్ సేల్స్ మరో రూ. 3000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ అన్ని ఆఫర్లతో కలిపి రూ. 14,000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. తద్వారా, ఐఫోన్ 13 కేవలం రూ. 57,900 ధర వద్ద లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
యాపిల్ మ్యాక్‌బుక్, వాచ్ సిరీస్‌లపై బంపరాఫర్లు..
విజయ్ సేల్స్ ఇతర యాపిల్ ప్రొడక్ట్స్‌పై కూడా బంపరాఫర్లను ప్రకటించింది. రూ. 83,700 ధర వద్ద గల M1 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌ను సైతం ఆఫర్‌పై కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, కోటక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి దీన్ని కొనుగోలు చేస్తే అదనంగా రూ. 6,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.