1. మరోసారి వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) స్మార్ట్‌ఫోన్ పేలినట్టు వార్తలు రావడం యూజర్లలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓ వ్యక్తి పేలిన స్మార్ట్‌ఫోన్ ఫోటోలను కూడా ట్వీట్ చేశాడు. "ఇలాంటిది మీ నుంచి అస్సలు ఊహించలేదు. వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) పేలింది. మీ ప్రొడక్ట్ ఎలా ఉందో చూడండి. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండండి. ప్రజల జీవితంతో ఆడుకోవడం ఆపండి" అంటూ సుహిత్ శర్మ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ ఈ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. (Image Credit: Twitter/@suhitrulz)
2. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ పేలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం కేరళలో వన్‌ప్లస్ నార్డ్ 2 ఛార్జర్ పేలింది. పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అప్పుడు కూడా బాధితులు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వోల్టోజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని, తమ డివైజ్‌లో ఎలాంటి లోపం లేదని వన్‌ప్లస్ వెల్లడించింది.
6. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే గతేడాది ఇండియాలో బాగా పాపులర్ అయిన వన్‌ప్లస్ నార్డ్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.30,000 లోపు సెగ్మెంట్లో వన్‌ప్లస్ నార్డ్ 2 క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. (image: OnePlus India)
7. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రామ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు టాప్ లెఫ్ట్ కార్నర్లో 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: OnePlus India)