1. యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం ప్రతీ ఒక్కరికీ ఎదురైన అనుభవమే. పేమెంట్ జరగకపోవడం, తమ అకౌంట్లో డబ్బులు డెబిట్ అయినా అవతలి వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ కాకపోవడం లాంటి సమస్యలు మామూలే. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ (UPI Transaction Failed) అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక యూజర్లు కంగారుపడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 24×7 హెల్ప్ లైన్ ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపులు, సేవలపై సమాచారం అందించేందుకు డిజీసాథీ (DigiSaathi) పేరుతో ఓ సర్వీస్ ప్రారంభించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థలకు చెందిన పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, పార్టిసిపెంట్స్‌తో కలిపి ఏర్పాటు చేసిన కన్సార్షియం ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
3. డిజిటల్ చెల్లింపుల ప్రొడక్ట్స్, సేవలకు సంబంధించి కస్టమర్లకు కావాల్సిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి డిజీసాథీ వాట్సప్‌లో అందుబాటులో ఉంటుంది. డిజీసాథీ కేవలం ఓ మెసేజ్ ద్వారా వాట్సప్‌లో చాట్‌బాట్ సౌకర్యంతో డిజిటల్ చెల్లింపులపై యూజర్ల అన్ని సందేహాలకు వినియోగదారులకు సహాయం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇందుకోసం యూజర్లు చేయాల్సిందే +91 892 891 3333 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేయడమే. ప్రస్తుతం వాట్సప్‌లో ప్రారంభమైన ఈ సర్వీస్ త్వరలో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. డిజీసాథీ సేవల్ని కస్టమర్లు వెబ్సైట్, ఛాట్‌బాట్ ద్వారా పొందొచ్చు. https://digisaathi.info/ వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 14431 లేదా 1800 891 3333 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదా +91 892 891 3333 నెంబర్‌కు వాట్సప్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆటోమేటెడ్ రెస్పాన్స్ సిస్టమ్ అయిన డిజీసాథీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఇటీవల ప్రారంభించారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, పీపీఐ వ్యాలెట్స్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ లాంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. డిజీసాథీ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఎలా వాడుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు. కస్టమర్లకు లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. కస్టమర్లు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు FAQ సెక్షన్లో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇటీవల యూజర్లు తాము ఓ గంటపాటు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయలేకపోయామని ట్విట్టర్లో ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పేమెంట్ ఫెయిలైంది. కొంత సమయం తర్వాత యూపీఐ సేవలు యథావిధిగా లభించాయి. (ప్రతీకాత్మక చిత్రం)