1. ఏటీఎం సెంటర్లో డబ్బులు చేయాలంటే ఏటీఎం కార్డ్ (ATM Card) కావాలి. కొన్ని బ్యాంకులు మొబైల్ యాప్స్ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు యోనో ఎస్బీఐ యాప్ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే టెక్నాలజీ వచ్చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. యూపీఐ యాప్స్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో ఆన్లైన్ పేమెంట్స్ కన్నా ఈజీగా యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే యూపీఐ యాప్ ద్వారా డబ్బులు ఎలా డ్రా చేయాలి? (How to withdraw cash using UPI app) అన్న డౌట్ మీకూ ఉందా? ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. యూపీఐ యాప్ ద్వారా డబ్బులు డ్రా చేయడానికి ముందుగా యూపీఐ సర్వీస్ అందుబాటులో ఉన్న ఏటీఎం సెంటర్‌కు వెళ్లాలి. క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. స్క్రీన్ పైన యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీరు ఎంత నగదు డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్యాష్ విత్‌డ్రా అవుతుంది. ఇలా సింపుల్‌గా ఏటీఎం కార్డ్ అవసరం లేకుండా నగదు డ్రా చేయొచ్చు. అయితే మీరు ఈ సర్వీస్ ఉపయోగించాలనుకుంటే మీరు వెళ్లే ఏటీఎం సెంటర్లో యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసే ఆప్షన్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ పనిచేస్తూ ఉండాలి. అంటే యూపీఐ యాప్‌లో యాడ్ చేసిన అకౌంట్ యాక్టీవ్‌లో ఉండాలి. దేశంలోని అన్ని ఏటీఎంలల్లో యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసేలా ఏర్పాట్లు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకుల్ని ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూపీఐ ద్వారా నగదు డ్రా చేసే అవకాశం కొన్ని బ్యాంకు ఏటీఎంలల్లో మాత్రమే అందుబాటులో ఉంది. యూపీఐ లేదా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ద్వారా ఫిజికల్ కార్డ్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా కార్డ్ క్లోనింగ్, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)