ఇకపోతే ఈ స్మార్టఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.8 అంగుళాల స్క్రీన్, కర్వ్డ్ అమొలెడ్ డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, డిమెన్సిటీ 920 ప్రాసెసర్, 5జీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. డిసెంబర్ 20న ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని రేటు దాదాపు రూ.42 వేల సమీపంలో ఉండొచ్చు.
కేవలం ఈ ఒక్క స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా కంపెనీ ఇతర వేరియంట్లను కూడా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రెడ్మి నోట్ 12, రెడ్మి నోట్ 12 ప్రో, రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ అనే మూడు ఫోన్లు మార్కెటలోకి రానున్నాయి. షావోమి ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో మీడియా టెక్ డిమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. వీటి ధర మన దేశంలో ఎంత ఉంటుందో తెలియాల్సి ఉంది. అయితే ప్రారంభ ధర రూ. 23 వేల నుంచి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. ఈ ఫోన్లను కూడా పరిశీలించొచ్చు.