TV Offers | టీవీ కొనాలని భావించే వారికి అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆన్లైన్లో టీవీ కొనుగోలుపై ఈ ప్రయోజనం పొందొచ్చు.
2/ 8
ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతోంది. ఇందులో భాగంగా టీవీలపై భారీ తగ్గింపు పొందొచ్చు. సోనీ, ఎల్జీ, వన్ప్లస్, శాంసంగ్ వంటి కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై అదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. నవంబర్ 30 వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
3/ 8
శాంసంగ్ క్రిస్టల్ 4కే 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 52,900గా ఉంది. అయితే దీన్ని ఇప్ప్డు రూ. 30,990కు కొనొచ్చు. అంటే 41 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్ ఉంది. 10 శాతం తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
4/ 8
అలాగే ఎల్జీ టీవీపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎల్జీ యూక్యూ7500 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 49,990గా ఉంది. దీన్ని ఈ సేల్లో భాగంగా రూ. 30,990కు కొనొచ్చు. అంటే 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫర్ కింద అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ వస్తుంది.
5/ 8
ఇంకా సోనీ బ్రావియా 50 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ టీవీపై అదిరే డీల్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 85,900గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 52,999కు కొనొచ్చు. అంతేకాకుండా రూ. 2 వేల వరకు బ్యాంక్ ఆఫర్ కింద తగ్గింపు వస్తుంది.
6/ 8
మరోవైపు వన్ప్లస్ స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే డీల్ అందుబాటులో ఉంది. వన్ప్లస్ యూ1ఎస్ 55 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది. దీనిపై 28 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
7/ 8
వన్ప్లస్ 4కే 55 అంగుళాల టీవీ రేటు రూ. 59,999గా ఉంది. అయితే ఈ టీవీని ఇప్పుడు సేల్లో భాగంగా రూ. 42,999కు కొనొచ్చు. అంటే 28 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే అదనంగా రూ. 2500 వరకు తగ్గింపు వస్తుంది.
8/ 8
అందువల్ల ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న బడ్జెట్లో నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకోవచ్చు. అలాగే టీవీలపై భారీ డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు.