2. Realme 3: ఇండియాలో వరుసగా బడ్జెట్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేస్తున్న రియల్మీ కొన్నాళ్ల క్రితం రియల్మీ 3 ఆవిష్కరించింది. 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999.
3. Redmi 7: రెడ్మీ 7 స్మార్ట్ఫోన్ 2జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా, 3జీబీ+32జీబీ ధర రూ.8,999 మాత్రమే. ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్రైట్ మోడ్, ఫేస్ అన్లాక్, సెల్ఫీ టైమర్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలు రెడ్మీ 7 స్మార్ట్ఫోన్లో ఉన్నాయి. 6.26 అంగుళాల హెచ్డీ+(1520x720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 12+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 2+32 జీబీ వేరియంట్ ధర రూ.7,999 కాగా 3+32 జీబీ వేరియంట్ ధర రూ.8,999.
4. Samsung Galaxy M10: సాంసంగ్ నుంచి రిలీజైన బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఇది. సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్ఫోన్ 6.2 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలో ఉందీ ఫోన్. ప్రాసెసర్ ఎక్సినోస్ 7870. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,400 ఎంఏహెచ్. ఓషియన్ బ్లూ, చార్కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది ఈ ఫోన్. 2జీబీ+16జీబీ ధర రూ.7,990, 3జీబీ+32జీబీ ధర రూ.8,990.
6. Realme 2: గతేడాది రిలీజైన రియల్మీ 2 స్మార్ట్ఫోన్కు ఇప్పటికీ డిమాండ్ ఉంది. బిగ్ బ్యాటరీ, నాచ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ రియల్మీ 2 ప్రత్యేకత. కెమెరా విషయానికొస్తే ఏఐ బ్యూటిఫికేషన్ 2.0, రియల్ టైమ్ ఏఆర్ స్టిక్కర్స్, ఫ్రంట్ కెమెరా హెచ్డీఆర్, బొకే మోడ్ లాంటి ఫీచర్లున్నాయి. 4230 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీతో 44 గంటల పాటు మాట్లాడుకోవచ్చు. 18 గంటల పాటు ఇంటర్నెట్ చూసుకోవచ్చు. 3 జీబీ + 32 జీబీ ధర రూ.9,499 కాగా 4 జీబీ + 64 జీబీ ధర రూ.10,990.
7. Asus Zenfone Max Pro M1: ఏసుస్కు చెందిన జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్ఫోన్కు మంచి డిమాండ్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తోంది. 3జీబీ+32 జీబీ ధర రూ.8,499 కాగా, 4జీబీ+64 జీబీ ధర రూ.10,499. 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ+(2160 x 1080) ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. 3 జీబీ + 32 జీబీ ధర రూ.8,499 కాగా 4 జీబీ + 64 జీబీ ధర రూ.10,499.
8. Realme C2: రియల్మీ నుంచి ఇటీవల వచ్చిన లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఇది. ఈ ఫోన్ డ్యూ డ్రాప్ డిస్ప్లేతో రావడం ప్రత్యేకత. 6.1 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.5,999 కాగా, 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999.
9. Redmi Y3: తక్కువ బడ్జెట్లో సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ కావాలనుకునేవారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్. రెడ్మీ వై3 స్మార్ట్ఫోన్లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. లోలైట్ సెల్ఫీ, ఏఐ బ్యూటిఫై 4.0, ఏఐ పోర్ట్రైట్ సెల్ఫీ, 360 డిగ్రీ ఏఐ ఫేస్ అన్లాక్, ఫుల్ హెచ్డీ సెల్ఫీ వీడియో రికార్డింగ్, షేక్-ఫ్రీ సెల్ఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 12+2 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ రియర్ కెమెరా ఉండటం విశేషం. 3+32 జీబీ వేరియంట్ ధర రూ.9,999.
10. Samsung Galaxy A10: సాంసంగ్ గెలాక్సీ ఏ10 స్మార్ట్ఫోన్లో 6.2 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉండటం విశేషం. సాంసంగ్ ఎక్సినోస్ 7884 ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ఫీచర్స్. 2జీబీ+32జీబీ ధర రూ.8,000 మాత్రమే.