TV Offer: వారెవ్వా.. రూ.43 వేల డిస్కౌంట్, రూ.9,500కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ కొనేయండి!
TV Offer: వారెవ్వా.. రూ.43 వేల డిస్కౌంట్, రూ.9,500కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ కొనేయండి!
Smart TV Offer | మీరు కొత్త టీవీ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే తక్కువ బడ్జెట్లనే సూపర్ టీవీ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ డీల్ తెలుసుకోండి.
43 Inch Smart TV | కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం కళ్లుచెదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే సూపర్ డీల్ సొంతం చేసుకోవచ్చు.
2/ 10
ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. క్రోమా వెబ్సైట్లో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఏకంగా రూ. 43 వేల భారీ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.
3/ 10
ట్రీవ్యూ ఇండ్ 43 ఇంచుల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీపై భారీ డీల్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 52,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 10,590కు కొనొచ్చు.
4/ 10
అంటే ఏకంగా 80 శాతం లేదా రూ. 42,400 వరకు తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్. 43 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలని భావించే వారికి ఇది ఊరించే ఆఫర్ అని చెప్పుకోవచ్చు.
5/ 10
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే 7.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
6/ 10
ఇంకా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీని కొంటే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మీరు ఈ ఆఫర్‌ను కలుపుకుంటే అదనంగా రూ.1000కి పైగా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
7/ 10
ఈ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. 20 వాట్ స్పీకర్లు ఉంటాయి. బెజిల్లెస్ డిస్ప్లే, డైనమిక్ క్రిస్టల్ కలర్, కాంట్రాస్ట్ ఎన్‌హ్యాన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
8/ 10
ఈ టీవీ వెబ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇంకా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్, సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.
9/ 10
ఇంకా మీరు ఈ టీవీని ఈఎంఐలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 499 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 24 నెలలకు వర్తిస్తుంది. అదే మీరు 18 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 661 కట్టాలి. లేదంటే ఏడాది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ. 951 పడుతుంది.
10/ 10
9 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1246 చెల్లించాలి. ఇంకా 6 నెలల ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1838 కట్టాలి. అదే మూడు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 36087 చెల్లించాల్సి ఉంటుంది. కాగా క్రెడిట్ కార్డు ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉండొచ్చు.