1. నోకియా 6.1 ప్లస్: ఈ ఏడాది ఆగస్ట్‌లో నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఫోన్ రిలీజ్ చేసినప్పుడు ధర రూ.15,999. ఇప్పుడు రూ.1,000 తగ్గింది. నాచ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. 4 జీబీ + 64 జీబీతో ఒకే వేరియంట్లో వచ్చింది ఈ ఫోన్. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో వచ్చిన ఈ ఫోన్‌కు ఇటీవలే 'ఆండ్రాయిడ్ 9 పై' అప్డేట్ కూడా లభించింది.
2. నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 5.8 అంగుళాలు, ర్యామ్: 4 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3,060 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, ధర: 4 జీబీ + 64 జీబీ- రూ.14,999.
3. రియల్మీ 2 ప్రో: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు పెంచుకుంటున్న రియల్మీ... ఇటీవల రియల్మీ 2 ప్రో రిలీజ్ చేసింది. షావోమీ, ఏసుస్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు పోటీగా రియల్మీ 2 ప్రో మార్కెట్లోకి వచ్చింది. ధర: 4 జీబీ + 64 జీబీ- రూ.13,990, 6 జీబీ + 64 జీబీ- రూ.15,990, 8 జీబీ + 128 జీబీ- రూ.17,990.
5. హానర్ ప్లే: హువావే సబ్ బ్రాండ్ హానర్ నుంచి వచ్చిన మరో ఫోన్ ఇది. నాచ్ డిస్ప్లే, జీపీయూ టర్బో టెక్నాలజీ, ఫేస్ అన్‌లాక్, నోటిఫికేషన్ సేఫ్టీ, త్రీడీ ఫేషియల్ రికగ్నిషన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. జీపీయూ టర్బో టెక్నాలజీతో ఫోన్ పెర్ఫామెన్స్ 60 శాతం పెరుగుతుందని, బ్యాటరీ వాడకం 30 శాతం తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.
6. హానర్ ప్లే: డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, ర్యామ్: 4జీబీ, 6జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, ప్రాసెసర్: కిరిన్ 970, రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3750 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, ఈఎంయూఐ 8.2, ధర: 4జీబీ+64జీబీ- రూ.17,999, 6జీబీ+64జీబీ- రూ.23,999.
7. షావోమీ పోకో ఎఫ్1: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ రిలీజ్ చేసిన ఈ మోడల్ ఓ సంచలనం. తొలి సేల్‌లోనే కేవలం 5 నిమిషాల్లో రూ.200 కోట్ల విలువైన ఫోన్లను అమ్మేసింది షావోమీ. ఈ ఫోన్ ఇటీవలే ఆఫ్‌లైన్ మార్కెట్లోకి వచ్చింది. ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్‌లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు. 5.99 అంగుళాల హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, అడ్రినో 630 జీపీయూ, లిక్విడ్ కూల్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఫోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయి.
8. షావోమీ పోకో ఎఫ్1: ర్యామ్: 6జీబీ, 8జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128జీబీ, 256 జీబీ, రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9, ధర: 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్- రూ.20,999,
6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ - రూ.21,999
, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ - రూ.27,999.
9. రెడ్మీ నోట్ 5 ప్రో: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్మీ నోట్ 5 ప్రో మోడల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కారణం... రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా పనితనమే. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన ఈ ఫోన్‌కు ఇప్పటికీ డిమాండ్ ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రో ధర కూడా తగ్గింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 మాత్రమే. ఫెస్టివల్ సేల్‌లో కొంటే ఆఫర్ ఉన్న బ్యాంకు కార్డులపై మరో 10% డిస్కౌంట్ లభిస్తుంది.