TO PROMOTE LOCAL PRODUCTION GOVT ANNOUNCES CURBS ON IMPORT OF COLOUR TVS SK
TV rates: టీవీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. పెరగనున్న ధరలు
ఒకప్పుడు రూ.30 వేలు పెడితే కానీ 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ వచ్చేది కాదు. కానీ ఎంఐ, వీయూ, కొడాక్ వంటి కంపెనీలు వచ్చాక టీవీ ధరలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు 10వేలకే 32 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ దొరుకుతోంది. ఐతే ఇకపై ఇంత తక్కువ ధరలకు టీవీలు దొరకకపోవచ్చు.

2/ 7
రానున్న రోజుల్లో కలర్ టీవీ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఎందుకంటే కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
3/ 7
ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి భారత్కు వస్తున్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
4/ 7
ఇప్పటి వరకు టీవీలను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (DGFT) విభాగం ప్రకటన జారీ చేసింది.
5/ 7
32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని ఎల్ఈడీ టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.
6/ 7
ఇకపై విదేశాల నుంచి టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని DGFT నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
7/ 7
భారత్కు ఎక్కువగా చైనా నుంచే టీవీలు దిగుమతి అవుతున్నారు. కేంద్రం విధించిన ఆంక్షలతో అక్కడి నుంచి దిగుమతులు భారీగా తగ్గనునున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో టీవీలు కూడా పెరగనున్నాయి.