ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి ఉత్తమ మాధ్యమం. అయితే మీరు చేసే చిన్న పొరపాటు కూడా మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా. అవును.. మీ చిన్న పొరపాటు వల్ల మీ వాట్సాప్ చాట్‌ని ఇతర వ్యక్తులు చదవగలరు. హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా కాకుండా.. ఉండాలంటే ఏం చేయాలి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
వెబ్ వాట్సాప్ ను తనిఖీ చేయండి..
WhatsApp వినియోగదారుల కోసం లింక్డ్ డివైజ్ అనే ఫీచర్‌ని కలిగి ఉంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో మీ మొబైల్ నుండి WhatsAppని ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో మీరు మొబైల్ మరియు కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ఒకేసారి WhatsAppను ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)