ఖగోళ శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఓ డౌట్. ఏంటంటే... మన సౌర వ్యవస్థలో మరో గ్రహం కూడా ఉండేదని... అది ముక్కలైపోవడంతో... దాని నుంచి విడిపోయిన రాళ్లే... గ్రహ శకలాలుగా... భూమివైపు వస్తున్నాయని. సరే... అది అలా ఉంచితే... ఇవాళ శనివారం కదా... ఈరోజు ఓ భారీ గ్రహ శకలం... భూమి వైపు వస్తోంది. దాని పరిమాణం 800 నుంచి 1800 అడుగుల దాకా ఉండొచ్చంటున్నారు. దాన్ని పొటెన్షియల్లీ డేంజరస్ కేటగిరీలో చేర్చింది నాసా. భూమికి ప్రమాదకరం అని భావించే గ్రహశకలాల్ని మాత్రమే ఈ జాబితాలో నాసా చేర్చుతుంది. గత నెల్లో వచ్చిన రెండు భారీ గ్రహశకలాల్ని కూడా ఇదే లిస్టులో నాసా చేర్చింది.
2002 NN4గా పిలిచే ఆ ఆస్టరాయిడ్... భూమికి 51 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. దాని వేగం సెకండ్‌కి 11.1 కిలోమీటర్లు. అంటే ఇది... విశాఖ నుంచి హైదరాబాద్‌కి నిమిషంలో వెళ్లగలదు. అంటే ఇది ఎంత వేగంతో వెళ్తుందో ఊహించుకోండి. అంత వేగంతో వెళ్లే రాయి భూమిని ఢీ కొంటే... భూమి ముక్కలవ్వడం ఖాయం. కానీ ఈ గ్రహశకలం వల్ల మనకు అలాంటి టెన్షన్ ఏదీ లేదనుకోవచ్చు. అది మనకు చాలా దూరం నుంచి వెళ్తోంది కాబట్టి ప్రమాదం లేదు.
2013 XA22గా పిలిచే మరో ఆస్టరాయిడ్... సోమవారం అంటే జూన్ 8న మధ్యాహ్నం 3.40కి... భూమివైపు వస్తోంది. ఇది NN4 కంటే కాస్త దగ్గర నుంచి వెళ్తుంది. మనకు 29.3 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. దీని పరిమాణం 160 మీటర్లు. గంటకు 24050 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఇది కూడా భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోయినా... నాసా దీనిపై ఓ కన్నేసి ఉంచింది.
2010 NY65 అనే గ్రహశకలం... జూన్ 24న ఉదయం 6.44కి భూమికి దగ్గరగా వచ్చి వెళ్లనుంది. ఆ సమయంలో అది మనకు 37.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని సైజు 310 మీటర్లు. గంటకు 46400 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. దీని వల్ల కూడా మనకు ఏమీ కాదు. ఏమీ కానప్పుడు ఇక మనం వీటి గురించి మాట్లాడుకోవడం ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే గ్రహశకలాలు ఎప్పుడూ ఒకేలా వెళ్లవు. ఒక్కోసారి దిశ మార్చుకుంటాయి. అవి వెళ్లే రూట్లో మరో రాయి తగిలితే... మొత్తం తేడా వచ్చేస్తుంది. అవి కొద్దగా దిశ మార్చుకున్నా చాలు... భూమిని ఢీకొనే ప్రమాదం ఉంటుంది. అందుకే నాసా ఇలాంటి విషయాలపై మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది.
తరలో మరో ఐదు గ్రహశకలాలు భూమివైపు రాబోతున్నాయి. వాటి గురించి అవి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మన భూమి చుట్టూ... 450 అడుగుల కంటే పెద్దగా విస్తీర్ణం కలిగిన గ్రహశకలాలు 8000కు పైగా ఉన్నాయి. ఇవన్నీ భూమికి 70 లక్షల కిలోమీటర్ల లోపు తిరుగుతున్నాయి. వీటిని నాసా పొటెన్షియల్లీ డేంజరస్ ఆస్టరాయిడ్స్ లిస్టులో చేర్చింది. ఇంకాస్త దూరానికి లెక్క వేస్తే... దాదాపు 25000 దాకా ఇవి ఉండొచ్చనే అంచనా ఉంది. ఇన్ని ఉన్నా... ఏ ఒక్కటీ భూమికి తగలకపోవడం మన అదృష్టం అనుకోవచ్చు.