1. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ ఇండియాలో లేటెస్ట్గా 32 అంగుళాల స్మార్ట్ టీవీని (32 inch Smart TV) రిలీజ్ చేసింది. ఆల్ఫా సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.10,000 లోపు కావడం విశేషం. థామ్సన్ ఆల్ఫా సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Thomson India)
2. థామ్సన్ ఆల్ఫా సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.9,999. సాధారణంగా ఈ ధరలో ఎల్ఈడీ టీవీలు వస్తుంటాయి. ఎల్ఈడీ టీవీని స్మార్ట్ టీవీగా మార్చాలంటే మరో డివైజ్ కొనాలి. ఈ డివైజ్ ధర రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. కానీ థామ్సన్ రూ.10,000 లోపే స్మార్ట్ టీవీని రిలీజ్ చేయడం విశేషం. (image: Thomson India)
3. ఎస్బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో ఈ స్మార్ట్ టీవీని రూ.8,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఉచితంగా గానా ప్లస్ మెంబర్షిప్ కూడా లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.490 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Thomson India)
4. థామ్సన్ ఆల్ఫా సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే బెజెల్ లెస్ డిజైన్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ రెడీ డిస్ప్లే ఉంది. ఇందులో యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ఎరాస్ నౌ లాంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి. మీరాక్యాస్ట్, బ్లూటూత్, వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. (image: Thomson India)
5. థామ్సన్ ఆల్ఫా సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీలో 512ఎంబీ ర్యామ్ ఉండగా, 4జీబీ స్టోరేజ్ ఉంది. మూడు హెచ్డీఎంఐ పోర్ట్స్, రెండు యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో రెండు స్పీకర్స్ ఉన్నాయి. 30వాట్ సౌండ్ ఔట్పుట్ లభిస్తుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Thomson India)
6. థామ్సన్ నుంచి ఏ సిరీస్‌లో అంగుళాల స్మార్ట్ టీవీ రూ.11,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీతో పోలిస్తే థామ్సన్ ఆల్ఫా సిరీస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.2,000 తక్కువ. ఆఫర్‌తో రూ.3,000 తక్కువకే కొనొచ్చు. థామ్సన్ నుంచి ఏ సిరీస్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. (image: Thomson India)