వాట్సాప్ వినియోగదారులకు స్కామ్ అలర్ట్..! ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటూ ఆశ చూపుతూ.. తర్వాత బ్యాంకు ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఈ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ సైబర్ కేటుగాళ్లు స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఈసారి ఫిషింగ్ దాడులతో తెగబడుతూ వాట్సాప్ యూజర్లను లక్ష్యం చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా వీరి స్కామ్స్ పేట్రేగిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో కొత్త స్కామ్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తాజాగా ఓ నివేదిక వాట్సాప్ యూజర్లందరినీ హెచ్చరించింది. విలువైన బహుమతులతో ఆకర్షించే ఓ ఫిషింగ్ లింక్ వాట్సాప్‌లో హల్చల్ చేస్తోందని.. దీనిపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు, క్రెడిట్/ డెబిట్ కార్డుల వివరాలను స్కామర్లు కొల్లగొట్టే ప్రమాదముందని తెలియజేసింది. ఫైనాన్షియల్ డేటాను కొల్లగొట్టే ఆ ఫిషింగ్ లింక్ ఏంటి? ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? దీన్నుంచి ఎలా సురక్షితంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
పండుగ వేళ సరికొత్త స్కామ్‌కు తెరలేపిన కేటుగాళ్లు రెడిరోఫ్.ఆర్యూ (Rediroff.ru) అని కలిగి ఉండే ఓ యూఆర్ఎల్ లింక్‌ను సెండ్ చేస్తారు. ఈ డేంజరస్ లింక్ ఆండ్రాయిడ్, విండోస్, పీసీ ఇలా అన్ని డివైజ్‌లను ఇన్ఫెక్ట్ చేయగలదు. అందుకే యూజర్లు దీనిపై క్లిక్ చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ స్కామ్ సరిగ్గా ఏరోజు స్టార్ట్ అయిందో తెలియలేదు కానీ ఇప్పటికే చాలా మంది దీని బారిన పడి దారుణంగా నష్టపోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సైబర్ మోసగాళ్లు మొదటగా Rediroff.ru తో స్టార్ట్ అయ్యే ఒక లింక్‌తో ఒక మెసేజ్‌ను వాట్సాప్ యూజర్లకు పంపుతారు. ఈ మెసేజ్‌లో మొబైల్స్ లాంటి విలువైన బహుమతులు, అదిరిపోయే రివార్డ్స్ గెలుచుకోవచ్చని.. ఇందుకు లింక్‌పై క్లిక్ చేయాల్సిందిగా కోరతారు. అది నిజమే అని భావించి లింక్‌పై క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. "మీరు విలువైన బహుమతి గెలుచుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సర్వేలో మీ వివరాలను ఫీల్ చేసి బహుమతి సొంతం చేసుకోండి" అని ఆ వెబ్సైట్లో ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఆ సర్వేలో వివరాలు పొందుపరిచగానే ఆ వెబ్సైట్ ఇంకొక వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ పేరు, వయస్సు, అడ్రస్, బ్యాంక్ వివరాలు.. ఇలా వ్యక్తిగత, ఫైనాన్షియల్ డేటా నమోదు చేయాలి అని అడుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ వివరాలన్నీ ఎంటర్ చేయగానే.. మోసగాళ్లు ఈజీగా యూజర్ల బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తస్కరించగలుగుతారు. లేదా మరేదైనా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజర్ల సమాచారాన్ని వాడుకుంటారు. ప్రమాదకరమైన అప్లికేషన్లను కూడా యూజర్ల డివైజ్‌లలో ఇన్స్టాల్ చేస్తారు.
Rediroff.ru లింక్‌ల్లో హానికరమైన మాల్వేర్ లేదా వైరస్ ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒకవేళ ఈ లింక్‌పై పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే మీ డివైజ్‌ను స్కాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. Rediroff.ru అనే పేరుతో వచ్చే వాట్సాప్ మెసేజ్ లను రిపోర్ట్ చేసి వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఈ తరహా ఫిషింగ్ అటాక్స్ అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందుకే వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏ కంపెనీ కూడా నిజంగానే బహుమతులు ఇస్తామని వాట్సాప్ మెసేజ్‌లు పంపించదు. ఈ స్కామ్ మెసేజ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ కనిపిస్తాయి. వీటిని గమనించి మీరు జాగ్రత్త పడవచ్చు. అలాగే పరిచిత నంబర్ల నుంచి వచ్చే అన్ని మెసేజ్‌లను ఓపెన్ చేయకుండానే డిలీట్ చేసుకోవడం ద్వారా స్కామ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)