షియోమీ (Xiaomi) తన స్మార్ట్ఫోన్ల యూజర్లకు తీపి కబురు అందించింది. షియోమీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లను వాడే ఇండియన్ యూజర్లకు మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియంను ఉచిత ట్రయల్ (Three-month YouTube Premium Free Trial)గా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నాడు ఈ మొబైల్ దిగ్గజం గూగుల్ (Google)తో తన పార్ట్నర్షిప్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఎంపిక చేసిన తన స్మార్ట్ఫోన్ల యూజర్ల(Selected Smartphone Users)కు మూడు నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత మీరు ఈ షియోమీ ఫోన్లు లేదా టాబ్లెట్‌ని కొనుగోలు చేసినట్లయితే యూట్యూబ్ ప్రీమియంని ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత అర్హత ఉన్న షియోమీ ఫోన్లలో దేనినైనా కొనుగోలు చేసినట్లయితే, జూన్ 6 నుంచి ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ప్రీమియం ఉచిత ట్రయల్‌గా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2 నెలల ఎక్స్టెండెడ్ ట్రయల్
షియోమీ పాడ్ 5, రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్లకు 2 నెలలు పాటు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం లభిస్తుంది. "అర్హత ఉన్న యూజర్లు జూన్ 6, 2022 నుంచి అర్హత గల షియోమీ, రెడ్మీ ఫోన్లలో ఈ యూట్యూబ్ ప్రీమియం ఆఫర్‌ను రీడీమ్ చేయవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది" అని షియోమీ తన ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీ వద్ద ఈ షియోమీ ఫోన్లలో ఏవైనా ఉంటే, ట్రయల్ పీరియడ్ ఆఫర్‌ను రీడీమ్ చేయడానికి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి "గెట్ యూట్యూబ్ ప్రీమియం" పై క్లిక్ చేసి తర్వాతి సూచనలు ఫాలో అయితే సరిపోతుంది. సాధారణంగా వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో వీడియోలపై యాడ్స్ ప్లే అవుతుంటాయి. యాడ్-ఫ్రీ వీడియో కంటెంట్ చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం తీసుకోవడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంకి యాక్సెస్, యాడ్-ఫ్రీ వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, హెచ్డీ ఆఫ్‌లైన్ వీడియోల డౌన్లోడ్, బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్-ఇన్-పిక్చర్ డిస్ప్లే వంటి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. అయితే ఆటో రెన్యువల్ లేని మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.139గా ఉంది. యూట్యూబ్‌లో 3-నెలలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ 399గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
దీనర్థం పైన పేర్కొన్న ఫోన్ యూజర్లు రూ.300 నుంచి రూ.400 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఆఫర్ పొందుతున్న ఫోన్లన్నీ కంపెనీ నుంచి ఇటీవలే విడుదలయ్యాయి. ఈ ఫోన్స్ ద్వారా వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియం అనుభవాన్ని అందించి వారికి ఈ సర్వీస్‌ను అలవాటు చేయాలని గూగుల్ షియోమీ ఇండియా భావిస్తున్నాయి. ఈ సర్వీసు నచ్చిన వినియోగదారులు ట్రయల్ పీరియడ్ అయిపోయాక డబ్బు చెల్లించి వాటిని పొడిగించవచ్చు. షియోమీ 12 ప్రో దేశంలోని షియోమీ నుంచి లాంచ్ అయిన అత్యంత ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్. దీని టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ.60,000గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)