అవన్ ట్రెండ్ ఈ(Avan Trend E ).. అవన్ ట్రెండ్ ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది . సింగిల్-బ్యాటరీ ప్యాక్ మరియు డబుల్ బ్యాటరీ ప్యాక్ దీని ధర రూ. 56,900 నుండి. సింగిల్-బ్యాటరీతో నడిచే వేరియంట్ 60కిమీ పరిధిని కలిగి ఉండగా, రెండోది 110కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు వేరియంట్ల గరిష్ట వేగం 45kmph మరియు గరిష్ట పేలోడ్ 150kgగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బౌన్స్ ఇన్ఫినిటీ E1
బౌన్స్ ఇన్ఫినిటీ E1 కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో ఒక వేరియంట్ ధర రూ.68,999. మరో వేరియంట్ ధర 45,099 గా ఉంది. బ్యాటరీ ప్యాక్ తో కూడినది.. బ్యాటరీ ప్యాక్ లేనిది. బ్యాటరీ ప్యాక్ తో కూడినది 1500 వాట్ల BLDC మోటార్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ వరకు వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)