ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివిధ రకాల యూజర్ల అవసరాలకు సరిపోయే మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అనేక స్మార్ట్ఫోన్లు రూ.20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ మిడ్‌రేంజ్ ఫోన్లు మంచి పనితీరు, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, ఇతర ఫీచర్లతో లభిస్తున్నాయి. మీరు రూ.20,000 బడ్జెట్లో పాపులర్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.
* Samsung Galaxy M33 5G
శామ్సంగ్ గెలాక్సీ M33 5G ఫోన్ 2022 ఏప్రిల్ 8న ఇండియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డీప్ ఓషన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ కలర్స్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 17,999. గెలాక్సీ M33 5G 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 6.6 అంగుళాల (16.76 సెం.మీ) డిస్ప్లేతో వస్తుంది. రియర్ కెమెరా సెటప్‌లో 50 MP + 5 MP + 2 MP + 2 MP కెమెరాలు ఉన్నాయి. 8 MP సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
* Redmi Note 11 Pro Plus 5G
ఈ ఫోన్ 2022 మార్చి 9న.. రూ.19,999 ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఇది ఇది 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉండే 6.67 అంగుళాల (16.94 సెం.మీ) డిస్ప్లేతో వస్తుంది. ఇది స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని రియర్ కెమెరా సెటప్‌లో 108 MP + 8 MP + 2 MP సెన్సార్స్, 16 MP సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. (image: Xiaomi India)
* iQoo Z6 5G
ఐక్యూ Z6 5G ఫోన్ ఇండియాలో 2022 మార్చి 16న లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.13,999. ఈ మొబైల్ 6.58 అంగుళాల (16.71 సెం.మీ) డిస్ప్లేతో, 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డైనమో బ్లాక్, క్రోమాటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియర్ కెమెరా సెటప్‌లో 50 MP + 2 MP + 2 MP సెన్సార్లు ఉన్నాయి. 16 MP సెల్ఫీ సెన్సార్ దీని సొంతం.
* Samsung Galaxy A23
శామ్సంగ్ గెలాక్సీ A23 ఫోన్ ఇండియాలో 2022 మార్చి 29న లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 19,499. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల (16.76 సెం.మీ) డిస్ప్లేతో వస్తుంది. 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ బ్లాక్, లైట్ బ్లూ, పీచ్, వైట్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. రియర్ కెమెరా సెటప్‌లో 50 MP + 5 MP + 2 MP + 2 MP కెమెరాలు ఉన్నాయి. ఈ మొబైల్ 8 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
* Poco X4 Pro: ఇండియాలో ఈ ఫోన్ 2021 మార్చిలో రూ. 19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల (16.94 సెం.మీ) డిస్ప్లేతో వస్తుంది. 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో 64 MP + 13 MP + 2 MP + 2 MP రియర్ కెమెరా సెటప్, 20 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. (image: Poco India)