ఇక ఈ బడ్జెట్ లో ప్రకటించిన కేటాయింపుల్లో.. రాబోయే రోజుల్లో భారతదేశంలో మొబైల్ ఫోన్లు చౌకగా మారే అవకాశం ఉంది. మరోవైపు వెండి కొనుగోలు ఖరీదైనది కావచ్చు. వాస్తవానికి.. ప్రభుత్వం మొబైల్ ఫోన్లలోని కొన్ని భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. బంగారం మరియు వెండిపై సుంకాన్ని పెంచింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
కొత్త బడ్జెట్లో కెమెరా లెన్స్‌లు చౌకగా లభించనున్నాయి. అంటే ఇప్పుడు మీరు మంచి లెన్స్‌లతో ఫోటోలు మరియు వీడియోలను క్యాప్చర్ చేసే ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్ డ్యూటీని 7.5 శాతం నుండి 15 శాతంకి పెంచారు. దీని వలన ఎలక్ట్రిక్ చిమ్నీలు ఖరీదైనవిగా మారనున్నాయి.