1. ట్విట్టర్లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) వెల్లడించారు. దీంతో ఆయన ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుడిగా మారారు. ఈ వార్తతో ట్విట్టర్ షేర్ ధర (Twitter Share Price) 23 శాతం పెరగడం విశేషం. వాక్ స్వాతంత్ర్యం పట్ల ట్విట్టర్ నిబద్ధతను ప్రశ్నిస్తూ మరో కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే విషయమైన సీరియస్గా ఆలోచిస్తున్నానని ఆయన ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒక్కోసారి ఆయన ట్వీట్స్ వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ఫలితంగా రెగ్యులేటరీ విచారణను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దాని విధివిధానాలను విమర్శిస్తూ వస్తున్నారు. సంస్థలు వాక్ స్వాతంత్రానికి కట్టుబడి ఉండటంలో విఫలం కావడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)