1. ఐఫోన్ 13 సిరీస్‌లో (iPhone 13 Series) నాలుగు స్మార్ట్ఫోన్లను మూడు నెలల క్రితం ప్రపంచానికి పరిచయం చేసింది యాపిల్. ఈ స్మార్ట్ఫోన్లు గతంలో రిలీజ్ అయిన మొబైల్స్ కన్నా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని యాపిల్ ప్రకటించింది. సిరామిక్ షీల్డ్ డిస్ప్లే, బలమైన స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో ఐఫోన్ మన్నిక చాలా ఎక్కువ అని కంపెనీ ప్రకటించింది.
2. మరి ఐఫోన్ 13 అంత బలమైనదేనా? అవును అంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ టెస్లా వాహనాన్ని కాస్త డ్యామేజ్ చేసిందని ఫోటోలు ట్వీట్ చేశారు. టెస్లా కారు రియర్ బంపర్‌ను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కాస్త చీల్చేసింది. ఈ ఘటనలో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ పైన ఉన్న స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా డ్యామేజ్ అయింది. (image: marvelwonderkat/twitter)
3. టెస్లా కారు గంటకు 113 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఢీకొట్టింది. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో స్మార్ట్ఫోన్లు మాత్రమే డ్యామేజ్ అవుతుంటాయి. కానీ ఈ ఘటనలో మాత్రం టెస్లా కారు బంపర్‌ను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ చీల్చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (image: marvelwonderkat/twitter)
4. అయితే ఈ ఘటన తర్వాత ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఎప్పట్లానే పనిచేసిందా లేదా అన్న స్పష్టత అయితే లేదు. స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే బాగానే డ్యామేజ్ అయింది. స్క్రీన్ ప్రొటక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. మరి లోపల డిస్ప్లే డ్యామేజ్ అయిందో లేదో తెలియదు. ఏదో మెటల్ పార్ట్ ఎగిరొచ్చి కారుకు తగిలిందని అనుకున్నానని, తీరా చూస్తే అది ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తించానని సదరు వ్యక్తి వివరించారు. (image: marvelwonderkat/twitter)
5. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మూడు నెలల క్రితం ఇండియాలో రిలీజ్ అయింది. 128జీబీ వేరియంట్ ధర రూ.1,29,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,39,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,59,900. సియరా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. ఐఫోన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
6. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంది. ముందువైపు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంది. ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
7. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ + 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 4352ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.