Home » photogallery » technology »

TECHNOLOGY NEWS FACEBOOK INSTAGRAM WHATSAPP SERVICES UNAVAILABLE FOR USERS AND ISSUE RESOLVED SK

Whatsapp | Facebook: ఆగిపోయిన వాట్సప్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ సేవలకు అంతరాయం..

ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ సోషల్ మీడియా ఖాతాలున్నాయి. సెకన్‌కు ఓసారి వాట్సప్, నిమిషానికోసారి ఫేస్‌బుక్ చూడకుండా ఉండలేకపోతున్నారు జనం. కాసేపు ఆ సేవలన్నీ నిలిచిపోతే ఎంతో కంగారుపడతారు. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా మరోసారి జరిగింది. సాంకేతిక కారణాలతో వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టగ్రామ్ సేవలకు కాసేపు అంతరాయం కలిగింది.