1. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సేపు జేబులో ఉంచుకోవద్దు. వేడిగా, ఉక్కపోతగా ఉండే ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను బయటే ఉంచండి. ఆఫీసులో లేదా ఇంట్లో అప్పుడు ఫోన్‌ను మీ డెస్క్‌పై ఉంచండి. గాడ్జెట్స్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువసేపు ఎలక్ట్రిక్ వస్తువులపై నేరుగా ఎండ పడటం వల్ల అవి వేడెక్కే ప్రమాదం ఉంది. అంతేకాదు డైరెక్ట్‌గా పడే సన్‌లైట్ వల్ల గాడ్జెట్స్ ఇంటర్నల్ పార్ట్స్‌కు నష్టం కూడా జరగవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. గాడ్జెట్లను ఆరుబయట ఛార్జ్ చేస్తే అవి పాడవుతాయి. సాధారణంగా గాడ్జెట్లను ఛార్జ్ చేస్తున్నప్పుడు వాటి టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. అదే అవుట్‌డోర్స్‌లో ఛార్జ్ చేస్తున్నట్లయితే వాటి టెంపరేచర్ మరింత పెరుగుతుంది. ఇది గాడ్జెట్స్ అధికంగా వేడెక్కడానికి కారణమై వాటిని పాడు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాటరీ దెబ్బతినకుండా ఉండేందుకు గాడ్జెట్లు ఓవర్ఛార్జింగ్ కాకుండా జాగ్రత్తపడాలి. మీ గాడ్జెట్స్‌ను దిండు, కుషన్, దుప్పటి మొదలైన వాటి కింద ఉంచి వాటిని ఛార్జ్ చేయవద్దు. ఎందుకంటే అవి గాడ్జెట్స్ నుంచి వచ్చే వేడిని బయటికి విడుదల చేయవు. దీనివల్ల దిండు కింద ప్రదేశం మరింత హీటెక్కి గాడ్జెట్లు బాగా వేడెక్కుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్ మీ డివైజ్ ను చల్లగా ఉంచుతుంది. ఏదైనా హెవీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మీ ల్యాప్‌టాప్‌లో వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్టాండ్‌లోని ఫ్యాన్లు గాలిని కింది నుంచి పైకి పంపడం ద్వారా డివైజ్ కూల్ అవుతుంది. ల్యాప్‌టాప్ కూలింగ్ స్టాండ్ USB-ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, కాల్ రికార్డింగ్ యాప్, కాల్ రికార్డర్ యాప్, ఔట్‌గోయింగ్ కాల్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్ ఫీచర్" width="1200" height="800" /> 6. గాడ్జెట్స్‌ను ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఉంచాలి. లేదంటే, వాటిని ఇంటి లోపల చల్లగా, నీడ ఉన్న, శుభ్రమైన ప్రదేశాలలో ఉంచడానికి ప్రయత్నించండి. వేడెక్కాయి కదా అని గాడ్జెట్‌ను ఫ్రీజర్‌లో ఉంచకూడదు. ఎందుకంటే ఘనీభవించిన తేమ లేదా నీరు గాడ్జెట్ లోపలికి ప్రవేశించి దాని పార్ట్స్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)