1. డైరెక్ట్ టు హోమ్ (DTH) కంపెనీ అయిన టాటా స్కై (Tata Sky) రీబ్రాండెడ్ వర్షన్ వచ్చేస్తోంది. టాటా ప్లే (Tata Play) పేరుతో ఓటీటీ సేవల్ని పరిచయం చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి 14 ఓటీటీ సేవల్ని టాటా ప్లేలో యాడ్ చేసింది. గతంలో 13 ఓటీటీ సేవలు ఉండగా వీటికి నెట్‌ఫ్లిక్స్‌ను చేర్చడంతో ఈ సంఖ్య 14 కి పెరిగింది. తమ బింజ్ ప్యాక్స్‌లో వీటిని అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. టాటా స్కైని రీబ్రాండ్ చేసి టాటా ప్లేని రూపొందించడం విశేషం. అంటే ఇప్పటివరకు ఉన్న టాటా స్కై లిమిటెడ్ ఇప్పుడు టాటా ప్లే లిమిటెడ్‌గా మారింది. దీని ద్వారా టెలివిజన్ కమ్ ఓటీటీ సేవల్ని కంబైన్డ్ ప్యాకేజీలో అందిస్తుంది. లెటెస్ట్‌గా తమ ఓటీటీ సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌ని కూడా యాడ్ చేయడం విశేషం. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు బింజ్ ప్యాక్స్‌లో లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. టాటా స్కైలో ప్రస్తుతం 19 మిలియన్లు అంటే కోటి 90 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నాయి. డీటీహెచ్, ఫైబర్ టు హోమ్ బ్రాడబ్యాండ్, బింజ్ సేవల్ని అందిస్తోంది టాటా స్కై. మొదట తాము డీటీహెచ్ కంపెనీగా ప్రారంభించామని ఇప్పుడు పూర్తిగా కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అవతరించినట్టు టాటా ప్లే సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరిత్ నాగ్‌పాల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. టాటా ప్లే నుంచి కొత్తగా నెలకు రూ.399 నుంచి కాంబో ప్యాక్స్ జనవరి 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సరికొత్త ప్యాక్స్‌ను నటీనటులైన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, మాధవన్, ప్రియమణితో ప్రమోట్ చేయనున్నారు. అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, డీటీహెచ్ కనెక్షన్స్, ప్యాక్స్‌ని బట్టి ధరలు మారనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. వీటితో పాటు టాటా ప్లే ప్రస్తుతం ఉన్న రూ.175 విజిటింగ్ ఛార్జీలను తొలగించింది. రీఛార్జ్ చేయని డీటీహెచ్ కస్టమర్లకు రీకనెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి. టాటా ప్లే కాంబో ప్యాక్స్‌ను కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ ఒకే ప్యాక్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)