1. టాటాకు చెందిన బ్రాండ్ అయిన స్ట్రైడర్ నుంచి లేటెస్ట్ ఎడిషన్ ఇ-బైక్స్ లాంఛ్ అయ్యాయి. స్ట్రైడర్ జీటా (Stryder Zeeta) పేరుతో సరికొత్త ఇ-బైక్ లాంఛ్ చేసింది కంపెనీ. ఈ బైక్ ధర రూ.31,999. లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. 20 శాతం తగ్గింపు పొందొచ్చు. డిస్కౌంట్‌తో స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌ను రూ.25,599 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Stryder)
3. స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే పెడల్, ఎలక్ట్రిక్ మోడ్ కలిపి 40 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో అయితే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వేగం విషయానికి వస్తే పెడల్ కాకుండా గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. (image: Stryder)
4. స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌లో ఆటో కట్ బ్రేక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతీ కిలోమీటర్ ప్రయాణానికి 10 పైసల ఖర్చు మాత్రమే అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల జర్నీకి రూ.10 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. స్ట్రైడర్కు చెందిన Voltic 1.7, ETB 100, Voltic Go మోడల్స్‌లో కూడా దాదాపు ఇంతే ఖర్చవుతుంది. (image: Stryder)
5. దేశ ఆరోగ్యం, స్థిరత్వం ప్రాధాన్యతతో, శక్తి-సమర్థవంతమైన, ఆరోగ్యకరమైన దేశం కోసం ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా సరసమైన రవాణా ఎంపికలను స్ట్రైడర్ అందిస్తోందని, ఫిట్ ఇండియా మిషన్‌కు చురుకుగా మద్దతు ఇవ్వడం, ఆరోగ్య స్పృహ కలిగిన ప్రయాణికులకు పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంలో స్ట్రైడర్ ముందుందని స్ట్రైడర్ బిజినెస్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. (image: Stryder)