1. టాటా మోటార్స్ మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టాటా అవిన్య (Tata Avinya) కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. అవిన్య సంస్కృత భాషలోని పదం. అవిన్య అంటే ఆవిష్కరణ అని అర్థం. అదే పేరుతో సూపర్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్. అవిన్య కాన్సెప్ట్ సరికొత్త సదుపాయాలతో ఉండటం విశేషం. (image: Tata Motors)
2. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో (TPEM) భాగంగా టాటా మోటార్స్ నెక్స్ట్ జెనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు TPEM కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు తాము సాధించిన అతిపెద్ద పురోగతిగా టాటామోటార్స్ ప్రకటించింది. (image: Tata Motors)
3. టాటా అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినది. ఈ కారులోని బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సామర్థ్యం ఉంది. కేవలం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే అరగంట ఛార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈజీగా వెళ్లిపోవచ్చు. (image: Tata Motors)
4. ఇది కొత్త తరం టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి రూపొందించిన ఎలక్ట్రిక్ కార్. కస్టమర్లకు అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో, సరళమైన, ప్రశాంతమైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన కార్ 2025 లోగా మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని టాటా మోటార్స్ ప్రకటించింది. (image: Tata Motors)
5. అవిన్య కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నప్పుడు, ఎందులో లేని విధంగా మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలన్నది ప్రధాన ఆలోచన అని, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో చక్కగా రూపొందించబడిన ఈ కారు కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుందని, ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరణను వేగవంతం చేయడమే కాకుండా, ఈ ఉద్యమానికి తాము నాయకత్వం వహించేలా సృష్టించామని టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. (image: Tata Motors)
8. టాటా మోటార్స్ కాన్సెప్ట్ కర్వ్ డిజిటల్ డిజైన్ థీమ్‌తో స్ఫూర్తి పొందింది. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్ ఉండబోతున్నాయి. ఇల్యుమినేటెడ్ లోగోతో సరికొత్త స్టీరింగ్ వీల్ ఉంటుంది. వెహికిల్ టు లోడ్, వెహికిల్ టు వెహికిల్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. (image: Tata Motors)