1. భారతదేశానికి చెందిన కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని కర్వ్ (Tata Curvv) పేరుతో పరిచయం చేసింది. రాబోయే రెండేళ్లలో ఈ కారును దేశీయ మార్కెట్లో పరుగులు తీయించనుంది. ఇది మిడ్ సైజ్ ఎస్యూవీ అని, హైఎండ్ లగ్జరీ సెగ్మెంట్‌కు భిన్నంగా స్పోర్టీ కూప్ బాడీ స్టైల్, వినూత్నమైన డిజైన్ ఉంటుంది. (image: Tata Motors)
2. టాటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కర్వ్ కారుకు సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఫోటోలు కార్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ఫోలియోలో కాన్సెప్ట్ కర్వ్ భాగం కానుందని, అందులో భాగంగానే ఈ కారు అందుబాటులోకి వస్తుందని ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. (image: Tata Motors)
3. మా వ్యాపారం పుంజుకుంటున్న తీరు చరిత్ర సృష్టిస్తుందని, రికార్డ్ సేల్స్‌తో మార్కెట్ షేర్ పెంచుకుంటున్నామని, గత ఆర్థిక సంవత్సరం తమకు అద్భుతమని, ఎస్యూవీ సెగ్మెంట్లో నెంబర్ 1 కావడం మాత్రమే కాదు, ఈవీ రంగంలో కూడా 353 శాతం సేల్స్ పెంచుకున్నామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. (image: Tata Motors)
4. టాటా మోటార్స్ కాన్సెప్ట్ కర్వ్ డిజిటల్ డిజైన్ థీమ్‌తో స్ఫూర్తితో పొందింది. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్ ఉండబోతున్నాయి. ఇల్యుమినేటెడ్ లోగోతో సరికొత్త స్టీరింగ్ వీల్ ఉంటుంది. వెహికిల్ టు లోడ్, వెహికిల్ టు వెహికిల్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. (image: Tata Motors)
6. దీంతో పాటు కర్వ్ కాన్సెప్ట్‌తో రెండో తరం ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణంలోకి అడుగుపెట్టామని, ప్రస్తుత అడ్డంకులను అధిగమిస్తూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెంచుతుందని ఆయన అన్నారు. భద్రత, విశ్వసనీయతను నిలుపుకొంటూ సరికొత్త ఆర్కిటెక్చర్‌తో రేంజ్, పెర్ఫామెన్స్, టెక్నాలజీని పటిష్టం చేస్తామని అన్నారు. (image: Tata Motors)