1. దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) నుంచి మరో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రిలీజైంది. టాటా మోటార్స్ తన అత్యంత పాపులర్ అల్ట్రోజ్‌లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) ట్రాన్స్‌మిషన్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. . (Photo: Manav Sinha/News18.com)
ఆల్ట్రోజ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) వేరియంట్ ధర రూ. 8.1 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాటా అల్ట్రోజ్ డీసీఏ అనేది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక అధునాతన డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్(Transmission). ఈ వేరియంట్ 45 పేటెంట్లతో వస్తుంది. (Photo: Manav Sinha/News18.com)
మరోవైపు, లెథెరెట్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, హర్మాన్ 7 అంగుళాల టచ్‌స్క్రీన్, 7 అంగుళాల TFT డిజిటల్ క్లస్టర్, వెనుక AC వెంట్స్, iRA కనెక్టెడ్ టెక్నాలజీ వంటి అదిరిపోయే ఫీచర్లను అందించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ XM+, XT, XZ, XZ+ వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. (Photo: Manav Sinha/News18.com)
దీని అధిక వేరియంట్ రూ. 9.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. అల్ట్రోజ్ డీసీఏ కొత్త ఒపేరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అల్ట్రోజ్ డీసీఏ వేరియంట్లో 1.2 లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. (Photo: Manav Sinha/News18.com)
అల్ట్రోజ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసిన సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ మాట్లాడుతూ, “భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆల్ట్రోజ్ డీసీఏను విడుదల చేయడం పట్ల మేము సంతోషిస్తున్నామని అన్నారు. . (Photo: Manav Sinha/News18.com)
ప్లానెటరీ గేర్ సిస్టమ్‌తో కూడిన ప్రపంచంలోనే మొదటి DCT వేరియంట్ ఇదే కావడం విశేషం. అల్ట్రోజ్ డీసీఏ వేరియంట్.. వెట్ క్లచ్ విత్ యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్-హీలింగ్ మెకానిజం, ఆటో పార్క్ లాక్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. (Photo: Manav Sinha/News18.com) (Photo: Manav Sinha/News18.com)