1. ఆన్లైన్లో ఇంటికి కావాల్సిన సరుకులు ఆర్డర్ చేసేవారికి అదిరిపోయే వార్త. త్వరలో డెలివరీ ఏజెంట్లు కాకుండా డ్రోన్లు సరుకులు (Drone Delivery) తీసుకురానున్నాయి. ఏకంగా డ్రోన్లే సరుకుల్ని మీ ఇంటివరకు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బెంగళూరుకు చెందిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ ఇలాంటి సర్వీస్ ప్రారంభించబోతోంది. (image: Swiggy)
2. ఇన్‌స్టామార్ట్ సేవల్లో భాగంగా డ్రోన్లను ఉపయోగించి గ్రాసరీస్ డెలివరీ (Groceries Delivery) చేయనుంది. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్తో కలిసి బెంగళూరులో, స్కైఎయిర్ మొబిలిటీ సంస్థతో కలిసి ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా డ్రోన్ డెలివరీని పరిశీలిస్తున్నామని స్విగ్గీ తెలిపింది. త్వరలోనే ఈ రెండు నగరాల్లో డ్రోన్ల ద్వారా గ్రాసరీస్ డెలివరీ ప్రారంభించనుంది స్విగ్గీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో గరుడ ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ కేంద్రాలను మనేసర్, గురుగ్రామ్, చెన్నైలో వర్చువల్గ్రా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రోన్ల తయారీ విలువ 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో డ్రోన్ సాంకేతిక సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థ 2024 నాటికి భారతదేశంలో లక్ష డ్రోన్లను తయారు చేయాలని సంకల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ ప్రాసెస్ ఎలా సాగుతుందో అగ్నీశ్వర్ జయప్రకాష్ వివరించారు. డార్క్ స్టోర్‌లో ఉన్న గ్రాసరీ ప్యాకేజెస్ని డ్రోన్లు డెలివరీ చేస్తాయి. డార్క్ స్టోర్లను సెల్లర్లు నిర్వహిస్తుంటారు. లేదా డ్రోన్ పోర్టుగా పిలిచే కామన్ మిడిల్ పాయింట్‌కు స్టోర్ నుంచి ప్యాకేజెస్ వస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కామన్ మిడిల్ పాయింట్‌ను స్విగ్గీ నిర్వహిస్తూ ఉంటుంది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన ఇన్‌స్టామార్ట్‌లో డ్రోన్ల వినియోగం ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలుసుకోవడమే ఈ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే డ్రోన్ల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగితే ఆ ఖర్చుల్ని స్విగ్గీ భరిస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కొనడానికి కంపెనీకి అవసరమైన డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ ట్రయల్స్‌లో భాగంగా ANRA సంస్థతో కలిసి ఫుడ్, ఫార్మాసూటికల్స్ ఉన్న ప్యాకేజీలను 300 డ్రోన్ డెలివరీలు చేసింది స్విగ్గీ. (ప్రతీకాత్మక చిత్రం)