ఇండియన్ మార్కెట్లో కొత్త ఫీచర్లతో(New Features) చాలా బడ్జెట్ ఫోన్లు(Budget Phones) అందుబాటులోకి వచ్చాయి. రూ.10,000 లోపు ఫోన్లు కూడా టాప్ ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో రిలీజ్ అయ్యాయి. గతంలో విడుదలైన ఫోన్ల కంటే మెరుగైన సదుపాయాలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.10,000 లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
* Poco C31
Poco C31 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.53 అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్) LCD డిస్ప్లే, బ్లూ లైట్ ఎమిషన్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. 4GB RAMతో పాటు స్పెషల్ మైక్రో SD స్లాట్ ఉంది. దీన్ని 512GB వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు వెనుకవైపు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సెల్ఫీల కోసం, డ్యూ డ్రాప్ నాచ్ వద్ద 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. గరిష్ఠంగా 540 గంటల స్టాండ్‌బై, 30 గంటల ఇ-లెర్నింగ్, 34 గంటల VoLTE కాలింగ్, 10 గంటల గేమింగ్‌కు పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
* Samsung Galaxy F12
Samsung Galaxy F12 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ ఇన్ఫినిటీ-V డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2.0Ghz ఆక్టా-కోర్ Exynos 850 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 6,000mAh బ్యాటరీ 15W USB అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో పని చేస్తుంది.
Micromax IN Note 1
Micromax IN Note 1 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 సెల్ఫీ కెమెరా కోసం పైభాగంలో పంచ్-హోల్ కటౌట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి+ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ MediaTek Helio G85 చిప్సెట్ని ఉపయోగిస్తుంది. గరిష్టంగా 4GB RAM అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఫోన్ 5000 mAh బ్యాటరీతో పని చేస్తుంది. USB-C 18W ఫాస్ట్ ఛార్జర్ అందుతుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెన్సార్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. దీనితోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Tecno Spark 8 Pro
అమెజాన్‌లో టెక్నో స్పార్క్ 8 ప్రో రూ.9,999కి లభిస్తుంది. టెక్నో స్పార్క్ ప్రో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 20.5: 9 యాస్పెక్ట్ రేషియో, 1,080×2,460 పిక్సెల్ రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Tecno Spark 8 Pro ఆక్టా-కోర్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
4GB LPDDR4x RAMని అందిస్తోంది. దీనిని వర్చువల్‌గా 7GB వరకు పెంచుకోవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజీ వస్తుంది. దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, AI లెన్స్ ఉన్నాయి. ముందు ప్యానెల్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కెమెరా ఇస్తున్నారు. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Realme Narzo 30A
Realme Narzo 30A 4GB RAM, MediaTek G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5 అంగుళాల HD+ (720 x 1600-పిక్సెల్ రిజల్యూషన్) డిస్ప్లేను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, ఫోన్ పోర్ట్రెయిట్ మోడ్, HDR, టైమ్-లాప్స్తో f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ AI కెమెరాను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)