రెడ్మీ నోట్ 11
రూ. 10 వేలలోపు బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే.. రెడ్మీ నోట్ 11 కూడా బెస్ట్ ఆప్షన్. రెడ్మీ నోట్ 11 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 13,499 వద్ద లభిస్తుంది. అమెజాన్‌లో మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దీన్ని కేవలం రూ. 10 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ అమౌంట్ మీరు ఎక్స్చేంజ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
శామ్సంగ్ గెలాక్సీ A03
రూ. 10 వేలలోపు బడ్జెట్ ధరలోనే శామ్సంగ్ గెలాక్సీ A03 అందుబాటులో ఉంది. ఇది కేవలం రూ. 7,999 ధర వద్ద లభిస్తుంది. దీని వెనుక భాగంలో 48MP కెమెరాతో పాటు 2MP డెప్త్ కెమెరాను అందించింది. ఇది ఆక్టా-కోర్ 1.6GHz ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రియల్మీ నార్జో 50i
రియల్మీ నార్జో 50i సెప్టెంబర్ 2021లో మార్కెట్లోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీని అమర్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్ఫినిక్స్ హాట్ 11
ఫ్లిప్‌కార్ట్ ఇన్ఫినిక్స్ హాట్ 11Sపై ఫ్లాట్ 28 శాతం తగ్గింపును అందిస్తోంది. దీని అసలు ధర రూ. 9,999 వద్ద ఉండగా.. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మరోవైపు, 6 నెలల పాటు గానా ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)