1. మీ ఫోన్లోని యాప్స్‌లో మాల్వేర్ నిత్యం కలకలం రేపుతూ ఉంటోంది. ప్రతీసారి పదుల సంఖ్యలో ఆండ్రాయిడ్ యాప్స్‌లో (Android Apps) మాల్వేర్ బయటపడుతుండటం స్మార్ట్‌ఫోన్ యూజర్లను భయపెడుతోంది. మాల్వేర్ ఉన్న యాప్స్‌ని గూగుల్ గుర్తించి తొలగిస్తూనే ఉన్నా... అప్పటికే యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో ఆ యాప్ డౌన్లోడ్ అయి ఉండటం వారికి ముప్పే. కాబట్టి జాగ్రత్తలు అవసరం (ప్రతీకాత్మక చిత్రం)
3. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇందుకోసం కొన్ని యాంటీవైరస్ యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసి స్కాన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ సులువుగా గుర్తించొచ్చు. ఉదాహరణకు క్యాస్పర్‌స్కీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Kaspersky Internet Security సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలి. Kaspersky Lab రూపొందించిన యాప్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఆ తర్వాత క్యాస్పర్‌స్కీ యాప్ ఓపెన్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాలి. యాప్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ready to scan మెసేజ్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Scan బటన్ ప్రెస్ చేయాలి. స్కానింగ్ పూర్తైన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలుస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్ ఉంటే క్యాస్పర్‌స్కీ యాప్ గుర్తిస్తుంది. ఆ వైరస్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి తొలగించాలి. ఏదైనా యాప్‌లో వైరస్ ఉంటే uninstall మెసేజ్ కనిపిస్తుంది. యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)