1. స్మార్ట్‌ఫోన్... రోజూ అనేక అవసరాలను తీర్చే సాధనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. అయితే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు సమస్యగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఉండటం, వాటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడపాల్సి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నోటిఫికేషన్ రాగానే చూడకుండా ఉండలేని పరిస్థితి యూజర్లది. ఎంత బిజీ పనుల్లో ఉన్నా, చివరకు హాలిడేస్‌లో, వెకేషన్లో ఉన్నా ఈ నోటిఫికేషన్ల సమస్య తప్పదు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ యాప్ రూపొందించింది. డిజిటల్ వెల్బీయింగ్లో భాగంగా 'పోస్ట్ బాక్స్' యాప్‌ను రూపొందించింది. ఆ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. (image: Playstore)