SMARTPHONE TIPS FOLLOW THESE SAFETY TIPS TO IDENTIFY FAKE APPS IN PLAYSTORE SS
Fake Apps: పొరపాటున ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి
Smartphone Tips | ఫేక్ యాప్స్... యాడ్వేర్ యాప్స్... మాల్వేర్ యాప్స్... ఇవన్నీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. యాప్ స్టోర్‌లో వందలు, వేలు కాదు... లక్షల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. వాటిలో చాలావరకు నకిలీ యాప్స్ కనిపిస్తాయి. మరి నకిలీ యాప్ ఏదో, ఒరిజినల్ యాప్ ఏదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ పాటించండి.
1. ఇటీవల కాలంలో నకిలీ యాప్స్ కలకలం రేపుతున్నాయి. యాప్‌లో ఉండే మాల్వేర్ లేదా యాడ్వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోకి చేరి మీకు తెలియకుండా మీ డేటా నొక్కేయడం లేదా యాడ్స్ రన్ చేయడం చేస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 15
2. ప్లే స్టోర్‌లోని ఇలాంటి యాప్స్‌ని గుర్తించినప్పుడల్లా గూగుల్ వాటిని తొలగించేస్తుంది. కానీ... అప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారు మాత్రం యాప్‌ను ఉపయోగిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 15
3. ఇలాంటి ఫేక్ యాప్స్ బారిన పడకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే నకిలీ యాప్స్‌ని సులువుగా గుర్తించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 15
4. మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న యాప్ డిస్క్రిప్షన్ చదవండి. అందులోనే యాప్ గురించి పూర్తి సమాచారం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 15
5. యాప్ డిస్క్రిప్షన్లో సమాచారం సమగ్రంగా లేకపోతే ఏదో తేడా ఉన్నట్టే. కొన్నిసార్లు ఒకే పేరుతో వేర్వేరుగా యాప్స్ కనిపిస్తాయి. నకిలీ యాప్ డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తపడాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 15
6. యాప్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత యాప్ డెవలపర్ పేరు చూడండి. వారి వెబ్సైట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 15
7. యాప్ డెవలపర్ పేరు అనుమానాస్పదంగా అనిపించినా, వెబ్సైట్లో సమాచారం సరిగ్గా లేకపోయినా అనుమానించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 15
8. ప్రతీ యాప్‌కు యూజర్ల రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్ ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 15
9. రేటింగ్ చూసిన తర్వాత రివ్యూలు చదవండి. చాలావరకు ఫేక్ రివ్యూస్ ఉంటాయి జాగ్రత్త. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 15
10. రివ్యూల్లో 5 స్టార్ ఇచ్చినవారి రివ్యూకంటే 1 స్టార్, 2 స్టార్ ఇచ్చినవారి రేటింగ్ చదివితే యాప్‌లో ఉన్న లోపాల గురించి తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 15
11. ఎడిటర్స్ ఛాయిస్ లేదా టాప్ డెవలపర్ లాంటి ట్యాగ్స్ ఉంటే ఆ యాప్‌ని నమ్మొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 15
12. ఎట్టిపరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడే మీరు ట్రాప్‌లో పడే అవకాశాలు ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 15
13. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్, కాల్స్, మీడియా ఫైల్స్ అన్నింటికీ పర్మిషన్ ఇవ్వకండి. ఆ యాప్‌కు ఎలాంటి పర్మిషన్లు అవసరమో అంతవరకే ఇస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 15
14. మీరు నెలలునెలలుగా వాడని యాప్స్ ఏవైనా ఉంటే డిలిట్ చేయడం మంచిది. దీనివల్ల ఫోన్లో స్పేస్ కూడా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 15
15. మీ స్మార్ట్‌ఫోన్‌కు లైసెన్స్డ్ వర్షన్ యాంటీవైరస్ ఉపయోగించండి. దీనికి పెద్దగా ఖర్చేమీ ఉండదు. రూ.50 చెల్లిస్తే ఏడాదిపాటు స్మార్ట్‌ఫోన్‌కు యాంటీవైరస్ సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)