6. స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాను తక్కువగా వాడేవారైతే డ్యూయెల్ కెమెరా ఉన్న ఫోటోలు చాలు. ఆ కెమెరాతో పోర్ట్రైట్ మోడ్ ఫోటోలు తీసుకోవచ్చు. అది కూడా 5 మెగాపిక్సెల్ వరకు ఉంటే చాలు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ట్రిపుల్ కెమెరా లేదా క్వాడ్ కెమెరా ఫోన్స్ ట్రై చేయొచ్చు. ప్రొఫెషనల్ స్థాయిలో ఫోటోలు క్లిక్ చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగపడ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఒకప్పుడు 2 మెగాపిక్సెల్‌తో స్మార్ట్‌ఫోన్ ఉండటమే గొప్ప. కానీ ఆ తర్వాత 4ఎంపీ, 8ఎంపీ, 16ఎంపీ, 32ఎంపీ దాటి 48 ఎంపీ వరకు వచ్చేశాం. త్వరలో 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసేందుకు షావోమీ, రియల్మీ లాంటి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ లోపే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఇటీవల షావోమీ రిలీజ్ చేసిన ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్లో మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే ఫోటోలు క్లారిటీగా వస్తాయన్నది వాస్తవం. కానీ... ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్నా... ఫోటోలు ఫోటో క్లిక్ చేసేవారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)