గూగుల్ ఫిట్ హార్ట్ రేట్ ఫీచర్, స్మార్ట్‌ఫోన్‌లో హార్ట్ రేట్ ఎలా చెక్ చేయాలి" width="1200" height="800" /> 1. ప్రముఖ స్మార్ట్బ్రాండ్ కేవలం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనే కాదు.. స్మార్ట్‌వాచ్ మార్కెట్లోనూ దుసుకుపోతుంది. ఇప్పో ఇండియా శుక్రవారం మార్కెట్లోకి అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఒప్పో రెనో 7 సిరీస్‌తో పాటు సరికొత్త వాచ్ ఫ్రీ స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒప్పో వాచ్ ఫ్రీ స్మార్ట్ఫోచ్ను బడ్జెట్ ధరలోనే ఆవిష్కరించింది. దీన్ని రూ. 5,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వాచ్ ఫ్రీ స్మార్ట్‌వాచ్ 1.75 -అంగుళాల 2.5D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 100+ స్పోర్ట్స్ మోడ్లకు మద్దతిస్తుంది. రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, రోయింగ్ మెషిన్ వంటి నిర్దిష్ట మోడ్లలో ఆటోమేటిక్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒప్పో వాచ్ ఫ్రీ స్మార్ట్‌వాచ్‌ను 6.0 వెర్షన్ లేదా తర్వాతి వెర్షన్లపై పనిచేస్తున్న ఏ స్మార్ట్ఫోన్తోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మరోవైపు, ఐఫోన్ 10 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లను ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్లకు సైతం వాచ్ ఫ్రీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో సిక్స్-యాక్సిస్ మోషన్ సెన్సార్లను అమర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)